హైదరాబాద్ : రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని.. ముఖ్యంగా ఆగ్నేయ, దక్షిణ దిశల వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే కురుస్తాయని పేర్కొంది. 10, 11వ తేదీల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.