హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల రెండ్రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నే య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నదని పేరొన్నది. ఈ క్రమంలో రా ష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. సోమవారం పలు జిల్లాలో ఉరు ములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
యువ వికాసం దరఖాస్తు తేదీని పొడిగించాలి
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తు తేదీని పొడిగించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటారమేశ్, ఆనగంటి వెంకటేశ్‌లు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరస సెలవులు, సర్వర్ మొరాయింపులతో చాలామంది యువత దరఖాస్తు చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. అలాగే సర్టిఫికెట్ల కో సం మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగినా.. త్వరగా జారీకావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు కుల, ఆదా య సర్టిఫికెట్లను త్వరగా దరఖాస్తుదారులకు అందించాలని విజ్ఞప్తిచేశారు.
ఉద్యానవన పంటలవైపు మొగ్గుచూపాలి
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు కేవలం వాణిజ్య పంటలే కాకుండా, ఉద్యానవన పంటలవైపు మొగ్గుచూపాలని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ రైతు మహోత్సవం-2025 వేడుకలకు ఆయ న హాజరై మాట్లాడుతూ.. భూసార పరీక్షలు చేసిన తర్వాత, దానికి తగ్గట్టుగా పంటలు సాగు చేపట్టాలని కోరారు. పంటలసాగులో పురుగుమందులు, రసాయనాల వాడకం తగ్గించి.. సేం ద్రియ పద్ధతుల్లో దిగుబడులు సాధించాలని అన్నారు. అనంతరం రైతుల నుం చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.