హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో పాట్నా-సికింద్రాబాద్, భరణి-కోయంబత్తూర్, దనపూర్-సికింద్రాబాద్, బెంగళూర్-దనపూర్ వంటి పలు రైల్వే స్టేషన్ల పరిధిలో 17 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్టు మంగళవారం ఆధికారులు ప్రకటించారు.
ఈ రైళ్లు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు మొత్తం 202 ట్రిప్పులు నడవనున్నట్టు తెలిపారు. వివరాలకు ఎస్సీఆర్ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.