హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : మెదక్ నుంచి మిర్జాపల్లి వరకు రైల్వేలైన్ పొడిగించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. తన విజ్ఞప్తి మేరకు రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి న్యూఢిల్లీలో గురువారం రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌కు వినతిపత్రం అందించినట్టు పేర్కొన్నారు. వనదుర్గా భవానీ ఆలయం, దేశంలోకెల్లా 8వ అత్యంత పెద్దదైన మెదక్ ఖిల్లా తదితర పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అకన్నపేట నుంచి మెదక్ వరకు రైల్వేలైన్ పొడిగించాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దగ్గరకు అఖిలపక్ష కమిటీ సభ్యులను తీసుకెళ్లి కోరినట్టు గుర్తుచేశారు.