హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బేగంపేటలోని ఆకాష్ ట్రేడింగ్ కంపెనీపై శనివారం దాడులు నిర్వహించారు. వంటకాల్లో వినియోగించే కొబ్బరిపొడి కల్తీ చేస్తున్నట్టు గుర్తించారు.
ఈ మేరకు రూ.92.47లక్షల విలువజేసే 60,050 కేజీల కొబ్బరి పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సద రు వ్యాపారిపై ఎఫ్ఎస్ఎఫ్ యాక్ట్ 2006 ప్రకారం చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.