KTR : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై రాహుల్‌గాంధీ ద్వంద్వ వైఖరి అవలంభిన్నారని ఆయన విమర్శించారు. ఒకవైపు కర్ణాటకలో, గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై బీజేపీని తప్పుపడుతున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కపటత్వాన్ని బయటపెట్టడం ద్వారా ఆ పార్టీపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ఆస్కార్ లెవల్లో నటిస్తున్నాడని, ‘నాటు-నాటు’ పాట తర్వాత రాహుల్‌గాంధీకే ఆస్కార్ అవార్డు దక్కాలని ఆయన ఎద్దేవా చేశారు. తనను తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేదిగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. తమ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినప్పుడు బాధిత కార్డును ప్లే చేస్తోందని, కానీ బీజేపీ చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు.
‘నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఏఐసీసీని ఒక విషయం అడగాలనుకుంటున్నా. మీకు ఏదైనా జరిగితే దాన్ని అన్యాయం అంటారు. అలాంటప్పుడు మీరు అదే అన్యాయం చేసి ఎలా సమర్థించుకుంటారు..?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఒకవైపు మీరు రాజ్యాంగం గొప్పతనం గురించి మాట్లాతారు. మరోవైపు అదే రాజ్యాంగాన్ని అవమానిస్తారు. మీరు చెప్పేది మీరే ఆచరించకపోతే ఎలా..?’ అని ఆయన నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీని తాము ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని కేటీఆర్ శపథం చేశారు. కాంగ్రెస్ పార్టీ బండారాన్ని ఢిల్లీలో బట్టబయలు చేస్తామని చెప్పారు. న్యాయం కోసం ఢిల్లీలో అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను కలుస్తామన్నారు. రేవంత్‌రెడ్డి తన ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడపాలని, ముఖ్యంగా ఆయన పరిపాలనపైనే దృష్టి పెట్టాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. 2004లో తాము కాంగ్రెస్‌తో కలిస్తే మా పార్టీని చీల్చేశారని, మళ్లీ అలాంటి తప్పును రిపీట్ కానీయదల్చుకోలేదని చెప్పారు.
#WATCH | Delhi: BRS working president KT Rama Rao says, “We will pressurise the Congress by exposing their hypocrisy… Rahul Gandhi’s performance is Oscar-worthy. After Naatu-Naatu, Rahul Gandhi should be the next winner of the Oscar award… Congress party portrays itself as a… pic.twitter.com/nJgtG1odl1
— ANI (@ANI) July 9, 2024