అమరావతి : కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో ( Suspicious Death ) మృతి చెందింది . జిల్లా కేంద్రంలోని అతీన ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ( Student ) రాత్రి పాఠశాల హాస్టల్లో అచేతనంగా ఉండడం చూసిన తోటి విద్యార్థినులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన హాస్టల్ వార్డెన్ బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.