Under -19 Asia Cup : పురుషుల అండర్ -19 ఆసియకప్ ఫైనల్లో భారత జట్టుకు పాకిస్థాన్ బిగ్ షాకిచ్చింది. భారీ స్కోర్ చేసిన పాక్ అనంతరం పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(26), ఆయుష్ మాత్రే(2)ను ఔట్ చేసి భారత్‌ను అలీ రజా(4-42) ఒత్తిడిలో ఒత్తిడిలో పడేశాడు. పాక్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులకు మిడిలార్డర్ బ్యాటర్లు వికెట్ ఇచ్చేశారు. టాప్ స్కోరరైన దీపేశ్ దేవేంద్ర(36)ను చివరి వికెట్‌గా వెనుదిరగడంతో 26.2 ఓవర్లలో 156కు భారత్ ఆలౌటయ్యింది. దాంతో.. 191 పరుగుల తేడాతో గెలుపొందిన పాకిస్థాన్ 12వ సారి విజేతగా రికార్డు నెలకొల్పింది.
అజేయంగా అండర్ 19 ఆసియాకప్ ఫైనల్ చేరిన భారత్ అనూహ్యంగా బోల్తా పడింది. లీగ్ దశలో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. టైటిల్ పోరులో మాత్రం తలొగ్గింది. మొదట ప్రత్యర్థిని భారీ స్కోర్ చేయనిచ్చిన ఆయుష్ మాత్రే బృందం.. ఆ తర్వాత బ్యాట్లెత్తేసింది. ఫైనల్లో భారత బౌలర్లును ఉతికేసిన పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్(172) విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. అహ్మద్ హుసేన్(56) అర్ధ శతకంతో మెరవగా దాయాది జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. భారీ ఛేదనలో టీమిండియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు అలీ రెజా(4-42).
𝐏𝐀𝐊𝐈𝐒𝐓𝐀𝐍 – 𝐓𝐇𝐄 𝐔𝟏𝟗 𝐀𝐒𝐈𝐀 𝐂𝐔𝐏 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒…!!!!
Pakistan U-19 defeated India U-19 by 191 runs in the final in Dubai. 🏆#Cricket #Pakistan #AsiaCup pic.twitter.com/Ls9r1b9OGv
— Sportskeeda (@Sportskeeda) December 21, 2025
ఓపెనర్ ఆయుష్ మాత్రే(2)ను పెవిలియన్ పంపిన అతడు కాసేపటికే డేంజరస్ వైభవ్ సూర్యవంశీ(26)ని సైతం వెనక్కి పంపాడు. ఆదిలోనే కష్టాల్లో పడిన టీమిండియాను గట్టెక్కిస్తారనుకున్న అరోన్ జార్జ్(16), విహాన్ మల్హోత్రా(7), అభిగ్యాన్ కుందు(13)లు పాక్ బౌలర్ల షార్ట్ పిచ్ బంతులకు వికెట్ పారేసుకున్నారు. 59కే నాలుగు, 94కే ఏడు వికెట్లు పడడంతో టీమిండియా కోలుకోలేకపోయింది.
Heated argument between Sir Ayush Mhatre & pakistani players. 😱🔥#INDvsPAK #U19AsiaCup
pic.twitter.com/24aq7CPm5p— AYUSH MHATRE (@ayush_m255) December 21, 2025
పవర్ ప్లేలోనే కీలక వికెట్లు పడడంతో మ్యాచ్ పాక్ చేతుల్లోకి వెళ్లింది. ప్రధాన బ్యాటర్లు డగౌట్ చేరినా దీపేశ్ దేవేంద్రన్(36) ఉన్నంతసేపు ధనాధన్ ఆడాడు. పాక్ బౌలర్లను దంచేస్తూ ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన దీపేశ్ చివరకు రజా ఓవర్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతే.. 26.2 ఓవర్లలోనే మ్యాచ్ ముగియగా.. 191 పరుగులతో గెలుపొందిన పాక్ 12వ సారి ఆసియా విజేతగా నిలిచింది.