కామారెడ్డి కాంగ్రెస్ నేతలకు టెన్షన్ పట్టుకున్నది. అక్కడ కాంగ్రెస్ సభలన్నీ అట్టర్‌ప్లాప్ అవుతుండడమే వారి ఆందోళనకు కారణం. వారం రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్‌ఫ్లాప్ అయింది. ఇది మర్చిపోకముందే ఆదివారం రాహుల్‌గాంధీ నిర్వహించిన సభకు జనాల నుంచి స్పందన రాలేదు. కీలక నేతల సభలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది.
జనసమీకరణకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇక్కడ బరిలో ఉండడంతో పరువు కాపాడుకునేందుకు ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తున్నది. గెలుపు సంగతి దేవుడెరుగు కనీసం డిపాజిట్ అయినా దక్కించుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. వారెంతగా తన్నులాడుతున్నా ప్రజలు మాత్రం వారి సభలకు ముఖం చాటేస్తున్నారు.