హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారి, షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో చోటుదక్కింది. రాహుల్‌బొజ్జాను సీఎంవోలోకి తీసుకుంటున్నట్టు సోమవారం శాలపల్లి దళితబంధు సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్సీ అభివృద్ధి కార్యదర్శిగానూ ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దళిత బంధు పథకాన్ని పక్కాగా అమలుచేసే బాధ్యతను సీఎం కేసీఆర్ రాహుల్ బొజ్జాకు అప్పగించిన విషయం తెలిసిందే.