హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): 29న రాహుగ్రస్త చంద్రగ్రహణం నేపథ్యంలో 28న టీటీడీ, వేములవాడ రాజన్న ఆలయాలు మూతపడనున్నాయి. ఈ పాక్షిక చంద్రగ్రహణం 29న తెల్లవారుజామున 1.05 గంటలకు మొదలై 2.22 గంటలకు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. 29న తెల్లవారుజామున ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.