విజయ్, శీతల్భట్ జంటగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘అలా జరిగిన కథ’. ప్రభు సూర్య దర్శకుడు. రేణుక శ్రీనివాస్ నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సినిమా కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, కథను ప్రేమించి అంతా పనిచేశారని దర్శకుడు ప్రభు సూర్య తెలిపారు.
‘ఇది మా సంస్థ నుంచి వస్తున్న తొలి సినిమా. దర్శకుడు సూర్య అద్భుతమైన కథను రాసుకున్నారు. టీమంతా ప్రాణం పెట్టి పనిచేశారు. మా తొలిప్రయత్నానికి ప్రేక్షకుల ఆశీస్సులుంటాయని నమ్ముతున్నాం’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ఇంకా హీరో విజయ్, డీవోపీ కేవీ గోలంధర్, మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్, జ్యోతి, నటులు చిత్రంశ్రీను, రవివర్మ, జబర్దస్త్ రాజమౌళి కూడా మాట్లాడారు.