హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లలో ఉద్యోగులకు ఇష్టారీతిన ప్రమోషన్లు కల్పించడంపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా డీపీసీల ఏర్పాటు, ప్రమోషన్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్పొరేషన్లలో ఇష్టారీతిన ప్రమోషన్లకు అడ్డుకట్ట వేసేందుకు శనివారం కీలక ఆదేశాలు జారీచేశారు.
ఏ కార్పొరేషన్ కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రమోషన్ల కమిటీలో కార్పొరేషన్ అధికారులే కాకుండా వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రటరీ లేదా జాయింట్ సెక్రటరీలో ఎవరో ఒకరు సభ్యుడిగా ఉండాలని నిబంధన విధించారు. కార్పొరేషన్లన్నీ ఇక నుంచి ఈ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.