యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలోని కొలనుపాక కల్వర్ట్ వద్ద వరద నీటిలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని రాచకొండ పోలీసులు ప్రాణాలతో కాపాడారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన జూల శ్రీకాంత్(39) అనే యువకుడు.. తన బైక్‌పై వెళ్తుండగా కొలనుపాక కల్వర్టు వద్ద వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ట్రాఫిక్ పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పీ వేద వ్యాస్, కానిస్టేబుల్ షేక్ అబ్దుల్ కలాం, క్రేన్ డ్రైవర్ ఎండీ హుస్సేన్ కల్వర్టు వద్దకు వచ్చి యువకుడి ప్రాణాలను కాపాడారు. తాడు సహాయంతో బైక్‌ను, శ్రీకాంత్‌ను ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను రాచకొండ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సకాలంలో ఘటనాస్థలికి వెళ్లి యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.
Today @YadadriTrPS & @Alair_PS rescued a person who slipped accidentally into #Waterflow with his bike at Kolanupaka #Water_logging point and completely closed the #Causeway from both sides as a #Waterflow increased. pic.twitter.com/er2gp1VBdc
— Rachakonda Police (@RachakondaCop) September 11, 2022