హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్ 202324)కు ఈ నెల 12 నుంచి జూన్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. ఆలస్య రుసుముతో జూన్ 20 వరకు దరఖాస్తు నమోదుకు అవకాశం ఉన్నదని వెల్లడించారు.
సోమవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సీపీగెట్ నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ఎనిమిది వర్సిటీల్లోని పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది కూడా సీపీగెట్ నిర్వహణ బాధ్యతలను ఓయూకే అప్పగించారు. వివరాలకు www.osmania.ac.in, https://cptget.tsche.ac.in, www.tsche.ac.in వెబ్సైట్లను సంప్రదించాలని సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.