హైదరాబాద్, ఫిబ్రవరి27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీసీ కాలేజీ హాస్టళ్ల అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖను రాసి, గురువారం విడుదల చేశారు.
అద్దె చెల్లించకపోవడంతో హాస్టళ్లను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే చెల్లించకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని లేఖలో హెచ్చరించారు.