ఖైరతాబాద్, ఆగస్టు 13: విద్యుత్తు సంస్థల్లో 2014 తర్వాత కల్పించిన అన్ని పదోన్నతులను ప్రభుత్వం సమీక్షించి బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎస్ సంస్థల్లో పదోన్నతులను నిలిపివేశారని, ఇందులో బీసీ, ఓసీ ఉద్యోగులే ఎక్కువగా నష్టపోయారని వాపోయారు.
జేఏసీ చైర్మన్ కే కుమారస్వామి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 4న విద్యుత్ సౌద ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ ఆర్ సుధాకర్‌రెడ్డి, కన్వీనర్ వెంకన్నగౌడ్, కో కన్వీనర్ భానుప్రకాశ్ పాల్గొన్నారు.