వనస్థలిపురం, డిసెంబర్ 3: రాష్ట్రంలో బకాయి ఉన్న 16.75 లక్షల మంది విద్యార్థుల ఫీజులు చెల్లించకుంటే ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హె చ్చరించారు. బీఎన్ రెడ్డి నగర్లో బీసీ యు వజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యా లీ నిర్వహించారు. కార్యక్రమానికి కృష్ణ య్య హాజరై మాట్లాడారు. విద్యార్థుల సమస్యల పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వాపోయారు. ర్యాలీలో నేత లు గుజ్జ సత్యం, మల్లేశ్ యాదవ్, రాజేందర్, పగిళ్ల సతీశ్, రామకృష్ణ పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అగ్ని ప్రమాదాలు, ఇతర కారణాలతో శరీరం కాలిన గాయాలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ చేయనున్నట్టు ‘బర్న్ సర్వైవర్ మిషన్ సర్వైవర్ ట్రస్ట్’ (బీఎస్ఎంఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. కాలిన తర్వాత అంగవైకల్యం (పోస్ట్ బర్న్ డిఫామిటీ) పొందిన వారికి ఊరట కల్పించేందుకు పెగా సిస్టమ్స్ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిబిరం నిర్వహిస్తున్నామని ట్రస్ట్ ప్రెసిడెంట్ శేషగిరి తెలిపారు. 7816079234 నంబర్‌కు ఫోన్‌చేసి రిజిస్టర్ చేసుకోవాలని, ఈనెల 6 వరకు చేసుకున్న వారికి ముందు గా అవకాశం దొరుకుతుందని తెలిపారు.