హైదరాబాద్ నుంచి క్విక్‌జెట్ ఫ్రైటర్ సర్వీసులు
క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్.. హైదరాబాద్ నుంచి ఫ్రైటర్ సర్వీసులను ప్రారంభించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బోయింగ్ 737-800ఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఢిల్లీ, బెంగళూరుకు రోజువారీ సరకు రవాణా సేవలను అందిస్తోంది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్ రూరల్: క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్.. హైదరాబాద్ నుంచి ఫ్రైటర్ సర్వీసులను ప్రారంభించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బోయింగ్ 737-800ఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఢిల్లీ, బెంగళూరుకు రోజువారీ సరకు రవాణా సేవలను అందిస్తోంది. రోజూ అర్ధరాత్రి 12:30 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్న ఈ సర్వీసు.. బెంగళూరు నుంచి ఉదయం 8:50కి తిరిగి వస్తున్నది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులను కవర్ చేసే తమ నెట్వర్ ప్రదేశాలకు కార్గోను తీసుకెళ్తోంది.
ఈ సందర్భంగా జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా నిరాటంకమైన, వేగవంతమైన కార్గో సేవలను అందించడానికి విశ్వశ్రేణి సదుపాయాలను కల్పిస్తున్నదని తెలిపారు. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన కార్గో హబ్‌లతోపాటు, ఫ్రాంక్ఫర్ట్, ఇస్తాంబుల్, దుబాయ్, దోహా, హాంకాంగ్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా రవాణా జరుగుతున్నదని చెప్పారు. కాగా, హైదరాబాద్ నుంచి దేశంలోని దక్షిణాది రాష్ర్టాలకు కార్గో కనెక్టివిటీని మరింతగా పెంచడానికి క్విక్‌జెట్ సేవలు ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుతం క్విక్‌జెట్ వద్ద 22 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో బి737-800ఎఫ్ రెండు విమానాలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

