Inter Board | హైదరాబాద్, నవంబర్ 7(నమస్తేతెలంగాణ): ఇంటర్బోర్డులో క్వశ్చన్ బ్యాంక్ మి స్సింగ్ అయిందనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం కారణమా? లేదంటే ఎవరైనా ఉ ద్దేశపూర్వకంగా మాయం చేశారా? అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వైరలవడం కలకలం రేపుతున్నది. బోర్డు అధికారులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డట్టు తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అనుమానాలు తలెత్తుతున్నవి.
క్వశ్చన్ బ్యాంకు ఆధారంగానే తయారీ
ఏటా మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఐదేండ్ల క్రితం క్వశ్చన్ బ్యాంక్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో వ్యాసరూప, లఘు, ఇతర ప్రశ్నలకు ఒక్కో నంబర్ కేటాయిస్తారు. ఈ నంబర్ల సాయంతోనే క్రమపద్ధతిలో ప్రశ్నలను ఎంపికచేస్తారు. సబ్జెక్ట్ నిపుణుల పరిశీలన అనంతరం తుది ప్రశ్నపత్రాన్ని విడుదల చేస్తారు.
తప్పులు దొర్లే అవకాశం..
క్వశ్చన్ బ్యాంక్ మిస్సింగ్ వార్తల నేపథ్యంలో ప్రశ్నపత్రాల తయారీ చర్చనీయాంశంగా మారింది. ప్రశ్నావళి లేకుంటే ప్రశ్నపత్రాల రూపకల్పనలో తప్పులు దొర్లే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే పరీక్షల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో బోర్డు కాన్ఫిడెన్షియల్ సిబ్బంది క్వశ్చన్ బ్యాంక్ మిస్సింగ్ విషయాన్ని గుర్తించినట్టు తెలిసింది. వారు వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసినట్టు వినికిడి. ఈ విషయంలో బోర్డు అధికారులు గోప్యత పాటిస్తున్నారు.
ఒకవేళ మిైస్సెన క్వశ్చన్ బ్యాంక్ కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు దొరికితే పరిస్థితి ఏంటని పలువురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి జయప్రదను వివరణ కోరగా.. ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. క్వశ్చన్ బ్యాంక్ మిస్సింగ్‌పై సమగ్ర విచారణ జరుపాలని, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు.