హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవన్లో ఆదివారం రాత్రి ఖవ్వాలి నిర్వహించారు. బజ్మ్-ఈ-ఘజల్ ఆధ్వర్యంలో టీ న్యూస్ ఉర్దూ ఎడిటర్ ఖయ్యూమ్ అన్వర్ ఆతిథ్యంలో జరిగిన కార్యక్రమానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఔత్సాహిక ముస్లింలు హాజరయ్యారు.
అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన గాయకుడు అద్నాన్ సలేం చేసిన గీతాలాపన ఆహూతులను ఆద్యంతం కట్టిపడేసింది.