నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 1 (నమస్తే తెలంగాణ): మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచందర్ ను 5 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ చిక్కడపల్లి పోలీసులు మంగళవారం నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సేచ్ఛ కూతరు, తండ్రి, ఇతర సాక్షుల నుంచి సేకరించిన కీలక వివరాల ఆధారంగా నిందితుడిని లోతుగా ప్రశ్నించడంతోపాటు స్వేచ్ఛ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇటీవల అరుణాచలం వెళ్లిన స్వేచ్ఛ, పూర్ణచందర్ హైదరాబాద్కు తిరిగొస్తుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తున్నదని, స్వేచ్ఛను పెండ్లి చేసుకుంటానని పూర్ణచందర్ నమ్మించి నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు. ఇప్పటివరకు పూర్ణచందర్ విచారణకు సహకరించలేదని తెలిపారు.