హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం (ట్రెటా) రాష్ట్ర అధ్యక్షుడిగా పూరి వెంకటయ్య ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. ప్రధాన కార్యదర్శిగా పీ విజయ్‌కుమార్, గౌరవాధ్యక్షుడిగా లక్ష్మారెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా బీ శరణప్ప, అసోసియేట్ అధ్యక్షులుగా ఎస్ రవిశంకర్, నాగభూషణం, ఆనందమూర్తి, తిరుపతయ్య, ఉపాధ్యక్షుడిగా మాణిక్యరెడ్డి, అవతారం, డేవిడ్ఫ్రాన్సిస్, రాజేంద్రప్రసాద్, అదనపు ప్రధాన కార్యదర్శులుగా పీఎస్ వినోద్‌కుమార్, అనిరుద్రారెడ్డి, విజయసేనారెడ్డి, పీ నర్సింహా, కార్యనిర్వాహక కార్యదర్శులుగా పీ రమేశ్, నాగభూషణం, రాజేశ్వర్‌రావు, జనార్దన్, రాజమల్లు, వెంకటయ్య తదితరులను ఎన్నుకొన్నారు.