ఐనవోలు, మే 9 : లండన్‌లో న్యూహోమ్ బొరో రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా పూజిత కొన్కటి ఎన్నికయ్యారు.. పెద్దపల్లి జిల్లా శ్రీ రాంపూర్ మండలం గంగారం పరిధిలోని ఉసిల్లపల్లికి చెందిన కొన్కటి పూజిత ఫార్మసీ, బయోటెక్నాలజీ పూర్తిచేసింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన కడ్డూరి శ్రీనివాస్ హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి లండన్‌లో ఉంటున్నాడు. వీరిద్దరికీ సంవత్సర క్రితం వివా హం జరిగింది. లండన్ న్యూహో మ్ బొరో రాయల్ అల్బర్ట్ వార్డులో ది గ్రీన్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థిగా కొక్కటి పూజితకు అవకాశం కల్పించారు. రెండు కౌన్సిల్ స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు జరిగాయి. కొక్కటి పూజిత 11 మంది అభ్యర్థులతో పోటీ పడి గ్రీన్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అధికారిక ప్రకటన సోమవారం వెలువడనున్నది.