Public Voice | దసర పండగత్తె మా అమ్మగారింటికి పోయేది. మా నాయన మంచిగ అర్సుకునేది. కొత్త బట్టలు తెచ్చేది. అవ్వి గట్టుకొని బతుకమ్మ ఆడేది. ఇప్పుడు నాయన లేడు. మా తమ్ముడు దసర పండక్కి చీరలు పెడ్తడు. ఆ తరీక కేసీఆర్ అన్న గూడ దసర పండక్కి చీర ఇస్తాండు. ఆయన గెలిచిన సంది బతుకమ్మ చీరలొస్తున్నయ్.
ఓ బాపు తన పిల్లలను ఎట్ల చూసుకుంటడో.. ముఖ్యమంత్రి సారు గట్లనే ఆడపిల్లలను మంచిగ అర్సుకుంటున్నడు. ఆయన పాలనల సంబురంగున్నది. ఇప్పుడు దసరాకు పుట్టింటికి పోతే ఒక చీరస్తాంది. సీఎం సారు ఇంకో చీర ఇస్తాండు. దండెం మీద బతుకమ్మ కేసీఆర్ అన్న ఇచ్చిన చీర చూస్తానే.. మా నాయన యాదికస్తడు. మల్లా ఆయనే గెల్వాలె.
– స్వరూప తుమ్మనపల్లి, హుజూరాబాద్