సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 27, 2021 , 21:06:39

సమస్యల పరిష్కారానికే ‘ప్రజా వేదిక’

సమస్యల పరిష్కారానికే ‘ప్రజా వేదిక’

మహబూబ్‌నగర్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ‘ప్రజా వేదిక’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందుకుగాను తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ గురువారమే (రేపటి నుంచి) ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన  వెల్లడించారు. ‘ప్రజా వేదిక’ పై మంత్రి హైద్రాబాద్ నుంచి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తీర్చటమే తన ధ్యేయమని అన్నారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఫిర్యాదుదారుడికి సహాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. 

ప్రజల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారాన్ని ఒక క్రమ పద్ధతిలో చేపట్టేందుకు గాను తన క్యాంప్ కార్యాలయంలో సిబ్బందిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఇకపై  ప్రతి గురువారం ‘ప్రజావేదిక’ ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఇందుకు గాను ఒక వెబ్‌సైట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ప్రజా వేదిక  కు వచ్చే దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లో  ప్రజా వేదిక పోర్టల్ ద్వారా  ఆయా శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. ప్రజా వేదిక కార్యక్రమాన్ని తన కార్యాలయ సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు.

ప్రజా వేదికపై అధికారులతో తాను స్వయంగా సమీక్ష చేస్తానని మంత్రి వెల్లడించారు. ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుదారు తన దరఖాస్తును రిజిస్టర్ చేసుకోగానే దరఖాస్తుదారుకు ఒక మెసేజ్ వస్తుందని, అలాగే  పని పూర్తి అయిన తర్వాత మరో మెసేజ్ వస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు 

అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు : స్పీకర్‌ పోచారం 

తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం 

ఉనికి కోసమే ఉత్తమ్ పాకులాట : ఎమ్మెల్యే శానంపూడి 

రోడ్డు ప్రమాదంలో సైకిలిస్ట్ మృతి  

VIDEOS

logo