హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): అదనంగా 10వేల ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టులను మంజూరుచేయాలని పీఆర్టీయూ ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ మంగళవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. మాడల్ స్కూల్ టీచర్లకు జూన్ నెల వేతనం విడుదల చేయాలని కోరారు.