నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లో జమ అయిన ఉద్యోగుల డబ్బులు వెనక్కి ఇవ్వబోమన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలసీతారామన్ వ్యాఖ్యలను పీఆర్టీయూ టీఎస్ తీవ్రంగా ఖండించింది. ఉద్యోగుల సొమ్ముపై కేంద్ర పెత్తనమేంటని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా రాష్ర్టాలు స్వచ్ఛందంగా ఎన్పీఎస్ నుంచి వైదొలగవచ్చని చెప్పి, ఇప్పుడు పెన్షన్ ఫండ్‌లోని డబ్బులు వెనక్కి ఇవ్వబోమనడం ఉద్యోగులను మోసగించడమేనని మండిపడ్డారు. ఉద్యోగులకు ఎలా ంటి లాభం చేకూర్చని పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని కేంద్రం రద్దుచేయాలని డిమాండ్ చేశారు.