హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు 50శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని పీఆర్టీయూ టీఎస్ కోరింది. కనీస వేతనంగా రూ.35 వేలను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసింది. పీఆర్టీయూ టీఎస్ ప్రతినిధి బృందం మంగళవారం బీఆర్కేభవన్లో కమిటీ చైర్మన్ శివశంకర్, సభ్యుడు రామయ్యతో భేటీ అయ్యింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు పలు అంశాలను పీఆర్సీ కమిటీ ఎదుట ప్రస్తావించారు. నూతన హెల్త్స్కీంను రూపొందించి అమలుచేయాలని, ఎయిడెడ్, మాడల్ స్కూళ్ల టీచర్లు, గురుకుల అధ్యాపకులకు 010 పద్దు ద్వారా వేతనాలివ్వాలని, హెల్త్‌కార్డులు అమలుచేయాలని, రూ.398 వేతనంతో పనిచేసిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయాలని కోరారు.
భేటీలో మాజీ ఎమ్మెల్సీలు పూల రవీందర్, బీ మోహన్‌రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పీ వెంకట్‌రెడ్డి, పీఆర్‌జీటీఏ అధ్యక్షుడు వీ దిలీప్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీకి అనుగుణంగా వేతనాలుండాలని టీఎస్ యూటీఎఫ్ కోరింది. సంఘం నేతలు మంగళవారం పీఆర్సీ కమిటీతో భేటీ అయ్యారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి, లక్ష్మారెడ్డి, వెంకట్, రాజశేఖర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి ఉన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఎస్టీయూ టీఎస్ నేతలు పీఆర్సీ కమిటీని కోరారు. భేటీలో ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పర్వత్‌రెడ్డి, జీ సదానందంగౌడ్, సదయ్య, జే గజేందర్, కందుకూరి దయానంద్, పోల్‌రెడ్డి, ఇఫ్తికారుద్దీన్, పీ రామసుబ్బారావు, ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సయ్యద్ సాబేర్ పాల్గొన్నారు.