హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో సస్పెండైన ఓ అడిషనల్ డైరెక్టర్‌కు.. ఆన్‌డ్యూటీ సదుపాయం కల్పించడం విమర్శలకు దారితీస్తున్నది. సస్పెన్షన్ కాలానికి కూర్చోబెట్టి పూర్తి జీతాన్ని చెల్లించడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం విద్యాశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల పాఠశాల విద్యాశాఖలో ఏడీపై పెద్దఎత్తున ఆ రోపణలు రావడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు.
తర్వాత కొంతకాలానికి సస్పెన్షన్‌ను ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వలేదు. సదరు అధికారి కోర్టుకెళ్లడంతో పోస్టింగ్ సైతం ఇచ్చారు. సస్పెన్షన్ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులను జారీచేసింది. సస్పెన్షన్‌లో ఉన్న కాలంలోనూ పూర్తివేతనం చెల్లిస్తారు. ఆ అధికారిని ఎందుకు సస్పెండ్ చేసినట్టు, ఎందుకు ఆన్‌డ్యూటీ కల్పించినట్టు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.