RSP | లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. తనను నమ్మి నాగర్‌కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించలేకపోయానన్న నిరాశ కొంత ఉన్నప్పటికీ.. విశాలమైన బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడి అయినందుకు గర్వంగా ఉందన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో వ్యయప్రయాసలకు ఓర్చుకుని.. అధికార పార్టీ ప్రతికూల చర్యలకు లొంగకుండా.. దాడులకు బెదరకుండా పార్టీని నమ్ముకుని తనను జనంలోకి నడిపించిన బీఆర్ఎస్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. వనపర్తి మాజీ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డా.గువ్వల బాలరాజు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డికి అలాగే జెండా మోసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, సమన్వయకర్తలకు, సోషల్‌మీడియా వారియర్స్‌కు, స్వేరోలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో తనను విశ్వసించి 3,21,343 అమూల్యమైన ఓట్లతో ఆశీర్వదించిన ప్రతి ఓటరుకు పాదాభివందనం తెలిపారు. మీ రుణం తీర్చుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదలనని ప్రమాణం చేశారు. ఇక నాగర్‌కర్నూలు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి అభినందనలు తెలిపారు.