జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని శాసన మండలి ప్రొటైం చైర్మన్ భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు ఉన్నారు. అనంతరం భూపాల్‌రెడ్డి లక్ష్మి పంప్ హౌస్‌ను సందర్శన చేయనున్నారు.