ఇంద్రవెల్లి, అక్టోబర్ 6 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం అమలు కాకముందు నుంచి నివాసం ఉంటున్న గిరిజనేతరులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి ఆదుకోవాలని గిరిజనేతరుల సంఘం, గిరిజనేతరుల ఐక్య వేదిక జిల్లా నాయకులు జాడే నాగోరావ్, మారుతి పటేల్ డోంగ్రే డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో శనివారం అధికారులు ఇండ్లను కూల్చివేయడంపై భగ్గుమన్నారు. ఇందుకు నిరసనగా ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో రిలే దీక్షలు చేపట్టారు. వీరికి సంఘీభావంగా మండల కేంద్రంలోని వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ పాటించారు.