గుమ్మడిదల, ఫిబ్రవరి19 : సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి, మహిళా జేఏసీ అధ్యక్షురాలు మల్లమ్మ ఆధ్వర్యంలో బుధవారం జాతీయరహదారిపై భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం మోకాళ్లపై నిల్చుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గౌడసంఘం అధ్యక్షుడు అర్జున్‌గౌడ్, రాములుగౌడ్, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో గుమ్మిడిదలలో 15వ రోజు రిలే నిరాహార దీక్షలో డంపింగ్ యార్డ్ రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్యారానగర్ డంపింగ్ యార్డ్‌ను వ్యతిరేకిస్తూ నల్లవల్లి, కొత్తపల్లి గ్రా మాల ప్రజలు ట్రాక్టర్లలో జాతీయరహదారి-765డీ మీదుగా నర్సాపూర్ చేరుకుని హైవేపై ధర్నా చేశారు. నర్సాపూర్‌లో ఆందోళనలో కుమ్మరి ఆంజనేయులు, రామకృష్ణ, శ్రీనివా స్, ఫయాజ్ షరీఫ్, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, సురేశ్, రాజుగౌడ్, రాము, ఆంజనేయులు, రవి, మహేందర్, కొరివి సురేశ్, మాజీ సర్పం చ్ రవి, గ్రామ అధ్యక్షుడు మహేశ్, పోచయ్య, ఎడ్లకాడి సత్తయ్య, శివకుమార్ అనిల్, శాంతమ్మ, లక్ష్మి, భారతమ్మ పాల్గొన్నారు.