కాసిపేట, సెప్టెంబర్ 8 : ‘ఏదో ఒక సాకు చూపుతూ మా వద్ద ఫైన్లు కట్టించుకుంటున్నరు.. అసలు రోడ్లే సరిగా లేవు.. కాంగ్రెస్ ప్రభుత్వం మాకెంత ఫైన్ కడుతుంది’ అని మాదిగ హక్కుల దండోరా సంఘం కాసిపేట మండల అధ్యక్షుడు అటుకపురం రమేశ్ ప్రశ్నించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్యాప చౌరస్తాలోని రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో అక్కడ బైఠాయించి ప్లకార్డు ప్రదర్శిస్తూ నిరసన తెలిపాడు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ దేవాపూర్‌లో యూనియన్ ఎన్నికలు జరిగితే ఆగమేఘాల మీద వచ్చి తన మనిషి గెలవాలని చూసిండు కానీ.. అభివృద్ధి మీద మాత్రం ఆసక్తి చూపించడంలేదని విమర్శించారు.