హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): బార్ల సమస్యలు పరిష్కరించాలని, వైన్‌షాపుల సమయపాలన తగ్గించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఓనర్లు ఆబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట అసోసియేషన్ నాయకులు ఆందోళనకు దిగారు. వైన్‌షాపుల వద్ద పర్మిట్ రూంలతో వ్యాపారం దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
పలువులు యజమానులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. జిల్లాల్లో వైన్ షాపులు ఉదయం 10నుంచి రాత్రి పది వరకు నడుస్తున్నాయని, జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం రాత్రి 11 గంటల వరకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాల్లో వేళల మాదిరిగానే జీహెచ్ఎంసీ పరిధిలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.