స్టేషన్‌ఘన్‌పూర్, అక్టోబర్ 14 : ‘ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్తే ఉన్న రేకుల ఇల్లు తొలగించిన. బేస్మెంట్ వరకు కొత్తగా కట్టిన.. ఇప్పుడు ఇల్లు రాలేదంటున్నరు’ అని ఓ నిరుపేద కన్నీరుపెట్టుకున్నాడు. మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 256 మంది లబ్ధిదారులకు ఎంపీ కడియం కావ్య అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్తో కలిసి ప్రొ సీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా చాగల్లు గ్రామానికి చెందిన పలువురు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టి తీసుకెళ్లగా, రెండో లిస్టులో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.