అమరచింత, ఆగస్టు 7 : తెగిపడిన విద్యుత్తు తీగలను గమనించకుండా వెళ్లిన కూలీ కరెంట్ షాక్‌తో మృతి చెందగా.. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహంతో స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. అమరచింత మండలం మస్తీపూర్‌కు చెందిన రా ముల శ్రీనివాసులు ఐదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు.
కౌలు రైతు పొలంలో పనులు చేసేందుకు గురువారం అదే గ్రామానికి రాముల తిరుపతయ్య(53) వెళ్లాడు. ఇక్కడ చాలా రోజుల కిందట కరెంట్ వైర్ తెగిపడింది. ఈ విషయాన్ని కౌలు రైతు కరెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించలేదు. ఈ విషయం తెలియని కూలీ అక్కడ పను లు చేస్తుండగా తీగ తగిలి కరెంట్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తిరుపతయ్య మృతిచెందాడని రైతులు, గ్రామస్థులు సబ్‌స్టేషన్‌కు చేరుకొని ధర్నాకు దిగారు.
మృ తుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యో గం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు అధికారులు చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించేందుకు కృషి చేస్తామని, లైన్‌మన్‌పై చర్యలు తీసుకుంటామని ఏఈ సుమంత్ హామీ ఇవ్వడంతో శాంతించారు. కేసు నమోదుచేసి నట్టు ఎస్సై హిమబిందు తెలిపారు.