పెద్దపల్లి, మార్చి 3(నమస్తే తెలంగాణ ): బూడిద లోడింగ్‌ను ఎన్టీపీసీనే చేపట్టాలని, ఒ క్కో టిప్పర్‌కు రూ. 4600 వసూలు చేస్తున్న దళారుల నుంచి విముక్తి కల్పించాలని లారీ, టిప్పర్ల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మల్యాలపల్లి గేట్ వద్ద యాష్ టిప్పర్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బూడిద లారీల రవాణాను నిలిపివేసి ఎన్టీపీసీకి వ్యతిరేకంగా నినదించారు. ప్రతి రోజూ దాదాపుగా వెయ్యి లారీల ద్వారా బూడిద రవాణా జరుగుతుంటే.. అందులో స్థానిక లారీలు కేవలం 120 వరకే ఉంటాయని చెప్పారు. నేషనల్ హైవేల నిర్మాణానికి బూడిదను తరలిస్తున్న లారీలకు ఒక్కో టన్నుకు ఎన్టీపీసీ రూ.1260 వరకూ చెల్లిస్తున్నదని తెలిపారు. ఒక్కో లారీకి రూ. 4600 నుంచి 9200 వరకు లోడింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారని వాపోయారు. యాష్ పాండ్‌లో లోడింగ్ దళారుల నుంచి విముక్తి కల్పించి ఇకపై నేరుగా ఎన్టీపీసీనే లోడింగ్ చేపట్టాలన్నారు. తమ సమస్యను ఎన్టీపీసీ యాజమాన్యం పరిష్కరించే వరకూ రవాణాను నిలిపి వేస్తున్నామని ప్రకటించారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెం కొత్త కాలనీ (పువ్వాడ ఉదయ్‌నగర్)లో 900 మంది పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు గుంజుకోవడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బాధితులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌ను ముట్టడించారు. స్థానిక ధర్నా చౌక్ నుంచి ప్రదర్శనగా వచ్చిన బాధితులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.