యాచారం, ఫిబ్రవరి 19 : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్దలో పాడి రైతులు బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. బుధవారం రోడ్డుపై పాలు పారపోసి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే మదర్ డెయిరీకి పాలు పోసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. కుర్మిద్ద పాడి రైతులకు 4లక్షలకు పైగా పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందని, సకాలంలో బిల్లులు చెల్లించకపోతే జీవనోపాధి ఎలా ఉంటుందని వాపోయారు. కాంగ్రెస్ పాలనలో పాడి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, బిల్లులు చెల్లించకపోతే ఊరుకునేదిలేదని మదర్ డెయిరీ కుర్మిద్ద సొసైటీ చైర్మన్ బందె మహేందర్రెడ్డి హెచ్చరించారు.