ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 28 : ‘ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు మాకొద్దు’ అంటూ ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ కెనాల్ పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో మ ధ్యాహ్న భోజన సమయంలో ఈ అన్నం తినలేమ ని, మెనూ ప్రకారం వడ్డించాలని నినదించారు.
దీని కి పీడీఎస్యూ నాయకులు మద్దతు తెలపడంతో సుమారు 2 గంటలపాటు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న డీఈవో సోమశేఖరశర్మ పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులను మందలించా రు.
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మళ్లీ భోజనం వండించి విద్యార్థులకు వడ్డించడంతో వారు శాంతించారు. అధికారులు పర్యవేక్షించి నా ణ్యమైన భోజనం అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.