తొర్రూరు, డిసెంబర్ 5: కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేయకపోతే అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపుతా? అని నిరుపేద మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు సీపీఎం మండల కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు, కంఠాయపాలెం సర్పంచ్ అభ్యర్థి ఎండీ యాకూబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో స్థానిక డబు ల్ బెడ్రూం ఇండ్ల వద్ద పేద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబు ల్ బెడ్రూం కోసం 8 నెలలుగా పోరాడుతున్నామని, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి సహా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ సమస్యలను పట్టించుకొని, డబుల్ బె డ్రూం ఇండ్ల కోసం పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదన్న కారణంతో ఎండీ యాకూబ్‌పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. యాకూబ్‌ను తొర్రూరు పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.