హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): సోలార్ ఫెన్సింగ్ పథకంతో పంటలకు రక్షణ కలుగుతుందని, దీనిని అమలుచేసే ఆలోచన చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఉద్యానశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సోలార్ ఫెన్సింగ్ సీం అమలవుతున్న హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో పర్యటించి, ప్రభుత్వం తరఫున సబ్సిడీపై అందజేసేందుకు విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలో కూరగాయల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ కోసం దరఖాస్తులు స్వీకరించి.. గ్రౌండింగ్ మొదలుపెట్టాలన్నారు.