హైదరాబాద్ సియుక్త వయసులోనూ ప్రొస్టేట్ క్యాన్సర్
పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్స ర్ చాపకింద నీరులా పెరుగుతున్నది. దీని నిర్ధారణ కోసం నిర్వహించే పీఎస్ఏ (ప్రొస్టేట్ స్పెసిఫికేషన్ యాంటిజన్ పరీక్ష) ప్రమాణాలే దీనికి కారణమని అపోలో వైద్యులు పేర్కొంటున్నా రు.
- 40 ఏండ్లలోపు పురుషులు జాగ్రత్త
- రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ గుర్తింపు
- అపోలో’ అధ్యయనంలో వెల్లడి
టీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్స ర్ చాపకింద నీరులా పెరుగుతున్నది. దీని నిర్ధారణ కోసం నిర్వహించే పీఎస్ఏ (ప్రొస్టేట్ స్పెసిఫికేషన్ యాంటిజన్ పరీక్ష) ప్రమాణాలే దీనికి కారణమని అపోలో వైద్యులు పేర్కొంటున్నా రు.అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చితే భారతీయ పురుషుల్లోని పీఎస్ఏ ప్రమాణాల్లో తేడా కనిపించినట్టు వెల్లడైందని అపోలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్ అపోలోలో మీడియాతో మాట్లాడుతూ.. పీఎస్ఏ అనే వైద్యపరీక్ష ప్రొస్టేట్ క్యాన్సర్‌కు ముందస్తుగా రోగనిర్దారణ, చికిత్స పర్యవేక్షణకు నిర్వహిస్తారన్నారు. అమెరికా అధ్యయనం ఆధారంగా రూపొం దించిన అంతర్జాతీయ నిబంధనలనే పాటించామని వెల్లడించారు. అయితే, పాశ్చాత్య పీఎస్ఏ ప్రమాణాలు భారత ప్రమాణాలకు సరిపోవని తెలిపారు. అపోలో వైద్యులు లక్ష మంది పురుషుల పీఎస్‌ఏల పరీక్షలు జరిపి, వాటి ఫలితాలను విశ్లేషించగా అంతర్జాతీయ, భారత పీఎస్ఏ ప్రమాణాల్లో వ్యత్యాసం కనిపించిందని వివరించారు. దేశంలోని 40 ఏండ్లలోపు వారికీ ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు ఉన్నదని వెల్లడించారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించటం వల్ల చాలా మంది రోగులు వ్యాధి ముదిరిన దశకు చేరుకుంటున్నారని పేర్కొన్నారు. అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ యూరో-అంకాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ అడ్డాల పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

