హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 7: ములుగు జిల్లా వెంకటాపూర్‌లో ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ మైనింగ్‌తో యునెసో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం, రామప్ప సరస్సుపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ మెంబర్ ప్రొఫెసర్ పాండురంగారావు ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం హనుమకొండలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
యునెసో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయం, వెంకటాపూర్‌లో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ప్రతిపాదించిన 300 మీటర్ల లోతైన ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాలతో తీవ్ర ముప్పు ఎదురవుతుందన్నారు. పీవీ నర్సింహారావు పేరును బదనాం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నాడని మాజీ మేయర్ తకళ్లపల్లి రాజేశ్వర్‌రావు ఆరోపించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకోకుంటే 45 గ్రామాల ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.