హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఆరోపించారు. శుక్రవారం ప్ర కటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేయాలని చూస్తున్నదని, వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఈ నెల 25న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామని, ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఆందోళన చేస్తామని హెచ్చరించారు.