హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు చార్జీలను పెంచాలని చేస్తున్న ప్రతిపాదనల ను ఈఆర్సీ తిరస్కరించాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) సభ్యుడిగా కంచర్ల రఘు నియమితుడైన సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. కొత్తగా సభ్యుడైన రఘు.. ప్రజల పక్షాన ఉండాలని కోరా రు. ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనను గత ఈఆర్సీ తిరస్కరించినట్టుగానే ప్రస్తుత ఈఆర్సీ కమిషన్ కూడా తిరస్కరించేలా చూడాలని ఈఆర్సీ సభ్యుడు రఘుకు దేశపతి శ్రీనివాస్ సూచించారు.