హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : శాంతి భద్రతలు కాపాడటంలో, త్వరితగతిన పోలీసు సిబ్బంది స్పందించడంలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తాయని, వీటి ద్వారా వచ్చిన కాల్స్‌పై సత్వర చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో డయల్ 100, 112 పనితీరుపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పోలీసు సిబ్బందిపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే నైపుణ్యం, స్పందనలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ ఎం భగవత్, టెక్నకల్ డీజీ వీవీ శ్రీనివాసరావు, ఐజీలు రమేశ్, సత్యనారాయణ, హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ పరిమళ హన విలువైన సూచనలు అందించారు.