హైదరాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ): 33 మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
పదోన్నతులు కల్పించడంపై హర్షం వ్యక్తంచేశారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.