హనుమకొండ, నవంబర్ 22: టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పలువురికి ప్రమోషన్లు కల్పిస్తూ బదిలీ చేస్తూ శనివారం ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు సూపరింటెండెంట్ ఇంజినీర్లకు చీఫ్ ఇంజినీర్లుగా, ఆరుగురు డీఈలకు సూపరింటెండెంట్ ఇంజినీర్లుగా, 21 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లకు డివిజనల్ ఇంజినీర్లుగా, జనరల్ మేనేజర్‌కు జాయింట్ సెక్రటరీగా, ఇద్దరు అసిస్టెంట్ సెక్రటరీలకు జనరల్ మేనేజర్లుగా, 8 మంది పర్సనల్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా, నలుగురు జూనియర్ పర్సనల్ ఆఫీసర్లకు పర్సనల్ ఆఫీసర్లుగా ప్రమోషన్లు కల్పించారు.
హనుమకొండ సర్కిల్ రూరల్ ఆపరేషన్ డీఈ సామ్యానాయక్కు పదోన్నతి కల్పిస్తూ కార్పొరేటర్ ఆఫీస్‌లో జీఎంగా పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్ సర్కిల్లో టెక్నికల్ డీఈ ఆనందంకు పదోన్నతి కల్పిస్తూ ములుగు ఆపరేషన్ ఎస్ఈగా, సెస్ డీఈ భిక్షపతికి ఎస్ఈగా పదోన్నతి కల్పిస్తూ కార్పొరేట్ ఆఫీస్‌లో జీఎంగా, ఎనర్జీ ఆడిట్ ఎస్ఈ అన్నపూర్ణకు కార్పొరేట్ ఆఫీస్‌లో ఎంఆర్టీ విభాగానికి, సురేందర్ ఆపరేషన్ జీఎం నుంచి ప్రాజెక్టు సీఈగా, సంపత్‌రెడ్డి సీఎండీ ఆఫీసులో డీఈ టెక్నికల్‌కు ఎస్ఈగా పదోన్నతి కల్పి స్తూ జనగామకు, రాజన్న డీఈ సీజీఎం మంచిర్యాల నుంచి ఎస్ఈగా ఆసిఫాబాద్‌కు పదోన్నతులతో బదిలీ చేస్తూ సీఎండీ వరుణ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియ శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగగా, మిగిలిన విభాగాలకు సంబంధించి నేడు పదోన్నతులు, బదిలీలు కొనసాగే అవకాశమున్నట్టు సమాచారం.